తెలంగాణ ఆత్మగౌరవం, ఆత్మీయతకు ప్రతీక అలయ్ బలయ్: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 22 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవం, ప్రజల మధ్య ఆత్మీయతకు ప్రతీకగా దత్తాత్రేయ‌ అలయ్ బలయ్ కార్యక్రమం నిలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి రవికుమార్ యాదవ్ అన్నారు. విజయదశమి (దసరా) పర్వదినాన్ని పురస్కరించుకుని హర్యానా మాజీ గవర్నర్, సీనియర్ జాతీయ నాయకుడు బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతంగా వివిధ వర్గాల ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, పరస్పరం ప్రేమాభిమానాలతో ఆలింగనం చేసుకునే ఈ ఆత్మీయ సమ్మేళనం తెలంగాణ సాంస్కృతిక వైభవానికి నిదర్శనమని కొనియాడారు. తెలంగాణ నేల సంస్కృతి, సంప్రదాయాలను దశాబ్దాలుగా పరిరక్షిస్తూ, వాటిని భావితరాలకు అందించేందుకు బండారు దత్తాత్రేయ చేస్తున్న కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన సాంస్కృతిక వేడుకకు తనను ఆహ్వానించిన బండారు దత్తాత్రేయకు, ఆయన కుమార్తె విజయలక్ష్మికి రవికుమార్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ సీనియర్ నాయకులు మహేష్ యాదవ్, గణేష్ ముదిరాజ్, ఆనంద్, రాజేష్, రాము, వినోద్, బాబు, నవీన్, అర్జున్, శ్రీకాంత్, అఖిల్‌తో పాటు పలువురు రాజకీయ, వివిధ రంగాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here