శేరిలింగంపల్లి, అక్టోబర్ 21 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రావణ దహనం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల్లో రావణ దహనంతో పాటు బాణాసంచా కాల్చడం, దాండియా ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమానికిహఫీజ్పేట్ గ్రామ పెద్దలు, పరిసర ప్రాంతాల ప్రజలు, యువతీ యువకులు, భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఏడాది శ్రీ వినాయక మహోత్సవాల్లో లడ్డూ ప్రసాదాన్ని కైవసం చేసుకున్న పొట్ట మల్లేష్ యాదవ్ కుటుంబ సభ్యులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారి చేతుల మీదుగా రామబాణం సంధించడంతో రావణ దహనం కార్యక్రమం ఘనంగా జరిగింది. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకలు భక్తుల్లో ఉత్సాహాన్ని నింపాయి.

ఈ కార్యక్రమంలో నిమ్మల గోపాల్ గౌడ్, బాలింగ్ లక్ష్మయ్య, కనకమామిడి యాదయ్య, బాలింగ్ యాదగిరి, తలారి లక్ష్మయ్య, తలారి భీమయ్య, అశోక్ ముదిరాజ్, బాలింగ్ గౌతమ్ గౌడ్, వెంకటేష్ గౌడ్, సుదర్శన్, శేఖర్ గౌడ్, జితేందర్ యాదవ్, ఆనంద్ గౌడ్, హనుమాన్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు కనకమామిడి నరేంద్ర గౌడ్, సురేందర్ గౌడ్, మన్నే వెంకటేష్, కుమ్మరి శ్రీశైలం, దేవేందర్, పాండు, చేగురీ సాయి, రాజేష్ యాదవ్, వినోద్ ముదిరాజ్, నరేష్, దిలీప్, ప్రవీణ్ యాదవ్, శ్రీకాంత్, రాము, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు, స్థానికులు, యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొనడంతో పండుగ వాతావరణం నెలకొంది. భక్తి, సంప్రదాయం, సాంస్కృతిక కార్యక్రమాల సమ్మేళనంగా రావణ దహనం వేడుకలు విజయవంతంగా ముగిశాయి.





