రాగం నాగేంద‌ర్ యాద‌వ్‌కు గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మి ప‌రామ‌ర్శ‌

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 17 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్‌ను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్, మాజీ జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పరామర్శించారు. నల్లగండ్లలోని వర్టెక్స్ కింగ్‌స్టన్ పార్క్‌లో ఉన్న రాగం నాగేందర్ యాదవ్ నివాసానికి వెళ్లిన ఆమె, ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాగం నాగేందర్ యాదవ్ సతీమణి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ బోర్డు మాజీ చైర్‌పర్సన్ రాగం సుజాత యాదవ్ చిత్రపటానికి గద్వాల్ విజయలక్ష్మి పూలమాల వేసి నివాళులర్పించారు. సుజాత యాదవ్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. మహిళా సంక్షేమం కోసం రాగం సుజాత యాదవ్ చేసిన సేవలు చిరస్మరణీయమని గద్వాల్ విజయలక్ష్మి కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆనంతుల మదన్ మోహన్ కుమార్తె అను, పటాన్‌చెరు డివిజన్ మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, అల్విన్ డివిజన్ మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్‌తో పాటు డివిజన్ సీనియర్ నాయకులు, యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here