శిల్పారామంలో అలరించిన కూచిపూడి నృత్య ప్రదర్శనలు

శేరిలింగంప‌ల్లి, అక్టోబ‌ర్ 3 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): మాదాపూర్ శిల్పారామంలో నిర్వహిస్తున్న గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉత్సవ్–2026 సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా శనివారం బెంగళూరు నుంచి విచ్చేసిన శ్వేతా ప్రసన్న కూచిపూడి నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు. అనంతరం గడ్డం వైష్ణవి, షర్మిల శిష్య బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించారు. మూషిక వాహన, ఝేమ్ ఝేమ్ తనను, గణేశా పంచరత్న, కృష్ణ శబ్దం, జతిస్వరం, రాగేశ్వరి తిల్లాన, హనుమాన్ చాలీసా, రామదాసు కీర్తన తదితర అంశాలను కళాకారులు ప్రదర్శించారు.

కుసుమ, హరిణి, షనాయా, చారిత్రిక, చైత్విక, చిన్మయి, శ్రీనిజ, శ్రీనిధి, ధనుశ్రీ, శాన్వి, ఆకృతి తదితర కళాకారులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను మెప్పించారు. సంప్రదాయ కూచిపూడి నృత్యంలోని అభినయం, లయ, నృత్య భంగిమలు ఆకట్టుకోవడంతో కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here