తెలుగు సినీ ద‌ర్శ‌కుల కోసం ప్ర‌త్యేక వైద్య శిబిరం

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 19 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): సినీ రంగంలో నివారణాత్మక ఆరోగ్యంపై అవగాహన పెంచే దిశగా తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ (TFDA), మెడికవర్ హాస్పిటల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సంయుక్తంగా సినీ దర్శకుల కోసం ప్రత్యేక హెల్త్ స్క్రీనింగ్ కూపన్ కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లోని మెడికవర్ హాస్పిటల్స్‌లో ప్రారంభించింది. అధిక ఒత్తిడి, నిరంతర పని గంటలు, అసమయ జీవనశైలి ఉన్న సినీ దర్శకులకు సమగ్ర ఆరోగ్య పరీక్షలు అందించడం ద్వారా ముందస్తు గుర్తింపు, ఆరోగ్య పరిరక్షణకు ఈ కార్యక్రమం దోహదం చేయనుంది. ఈ కార్యక్రమాన్ని TFDA ముఖ్య ప్రతినిధులు అధ్యక్షుడు వి.ఎన్. ఆదిత్య, ప్రధాన కార్యదర్శి పి.వి. రామారావు, ఖజాంచి ఎన్. సాయి రాజేష్ సమక్షంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వి.వి. వినాయక్, ఎన్. శంకర్, జి. రామ్ ప్రసాద్, వి. సముద్ర, సాగర్ కె. చంద్ర హాజరయ్యారు.

ఈ సందర్భంగా దర్శకుడు వి.వి. వినాయక్ మాట్లాడుతూ దర్శకులు నిరంతరం పని ఒత్తిడితో తమ ఆరోగ్యాన్ని పట్టించుకోర‌ని, ఆరోగ్యమే ముఖ్యమని గుర్తు చేసే ఈ కార్యక్రమం సమయోచితమైనద‌న్నారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన TFDA, మెడికవర్ హాస్పిటల్స్‌కు అభినందనలు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు. దర్శకుడు ఎన్. శంకర్ మాట్లాడుతూ సినీ రంగం చాలా కఠినమైనద‌ని, తాము చాలాసార్లు ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేస్తామ‌ని తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు అవగాహన పెంచడంలో, ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో ఎంతో సహాయపడతాయ‌ని అన్నారు. ఈ ఉచిత ఆరోగ్య పరీక్ష ప్యాకేజీలో రక్త పరీక్షలు, గుండె సంబంధిత పరీక్షలు, ఇమేజింగ్ సేవలు, నిపుణుల వైద్యుల సంప్రదింపులు వంటి అనేక సేవలు అందించారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here