ఎమ్మెల్యే గాంధీ చేతకానితనంతో శేరిలింగంపల్లిలో కుంటు పడిన అభివృద్ధి: చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, మార్చి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ఎమ్మెల్యే ఆరెపూడి గాంధీపై శేరిలింగంపల్లి BRS పార్టీ ఉద్యమ నాయకుడు చిర్రా రవీందర్ యాదవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో సమస్యల‌ను గాలికి వదిలేసి, పార్టీలు మారి జేబులు నింపుకునే పనులకు ముందు నిలుస్తున్నారు అని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ చేతకానితనంతో శేరిలింగంపల్లిలో అభివృద్ధి కుంటుపడింద‌న్నారు. రోజు రోజుకూ నియోజకవర్గం వెనుకబాటుకు గుర‌వుతుంద‌న్నారు. అసెంబ్లీలో స్వయంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పనులు జరిగాయ‌ని ఎమ్మెల్యే గాంధీ చెప్పిన విషయాన్నీ గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు జరగట్లేదు అని ఆయనే స్వయంగా చెప్పారని, నియోజకవర్గం అభివృద్ధి చేయడంలో ఫెయిల్ అయ్యారని చిర్రా రవీందర్ యాదవ్ మండిపడ్డారు. హైటెక్ సిటీలో రోడ్లు మూడు ఏళ్లుగా పెండింగ్ లోనే ఉంచార‌ని ఎత్తి చూపారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యం కారణంగా ఐటీ ఉద్యోగులు నరకం చూస్తున్నార‌ని వెల్లడించారు. గంగారం నుంచి అపర్ణ వరకు రోడ్డు పనులు పూర్తి చేయలేని స్థితిలో ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ ఉన్నార‌ని మండిపడ్డారు. టికెట్ ఇచ్చి గెలిపించిన బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యే గాంధీ వెన్నుపోటు పొడిచారని, అధికారం పోగానే కండువాలు మార్చడం ఆయనకు వంట పట్టింద‌ని ఎద్దేవా చేశారు. అధికార కాంగ్రెస్ లో చేరినా రూపాయి కూడా అభివృద్ధి చేయలేక ఎమ్మెల్యేగా విఫలం అయ్యారని చిర్రా రవీందర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే శేరిలింగంపల్లి ప్రజలకు ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ క్షమాపణలు చెప్పాల‌ని చిర్రా రవీందర్ యాదవ్ డిమాండ్ చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here