భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పీజేఆర్ స్టేడియంలో రక్తదాన శిబిరం

శేరిలింగంప‌ల్లి, మార్చి 22 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): స్వాతంత్ర సమరయోధుడు, దేశం కోసం ప్రాణాలర్పించిన భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా స్టీఫెన్, ఆయ‌న సన్నిహితుల ఆధ్వర్యంలో పీజేఆర్ స్టేడియంలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి అసెంబ్లీ ఇంచార్జ్ రవికుమార్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర‌వికుమార్ యాద‌వ్ మాట్లాడుతూ భగత్ సింగ్ లాంటి వారు చేసిన ప్రాణ త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఆస్వాదిస్తున్న స్వాతంత్రం అని అన్నారు. ఆయన జీవితం ప్రధాని మోదీ, త‌మ‌లాంటి ఎంతో మంది నాయకులకు స్పూర్తి అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అర్జున్, స్టీఫెన్, ప్రభాకర్, శివ, బంటి పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here