కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి : మియాపూర్ డివిజన్ అభ్యర్థి ఇలియాస్ షరీఫ్

ఎన్నికల ప్రచారంలో స్థానిక ప్రజలను ఓటు అభ్యర్థిస్తున్న ఇలియాస్ షరీఫ్

మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): ఎల్లవేళలా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన సాగించిన కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి అని మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి ఇలియాస్ షరీఫ్ అన్నారు. బుధవారం డివిజన్ పరిధిలోని స్టాలిన్ నగర్, ముజఫర్ అహ్మద్ నగర్ లలో ఆయన పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. అనంతరం ఇలియాస్ షరీఫ్ మాట్లాడుతూ రాష్ట్రం లో పేద ప్రజలకోసం ఆరోగ్యశ్రీ, వికలాంగ వృద్ధాప్య పెన్షన్ లు వంటి సంక్షేమ పథకాలను ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటువేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న దృశ్యం
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here