హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో గౌతమ్ గౌడ్ ప‌ర్య‌ట‌న

శేరిలింగంప‌ల్లి, డిసెంబ‌ర్ 14 (న‌మస్తే శేరిలింగంప‌ల్లి): హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలోని ఆదిత్య ఇంపీరియల్ హైట్స్ అపార్ట్మెంట్స్ లో సమస్యల పరిష్కారం కోసం హఫీజ్ పేట్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గౌతమ్ గౌడ్ ప‌ర్య‌టించారు. అలాగే మంజీరా పైప్ లైన్ రోడ్డు పనులను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పెండింగ్ పనులు, ఫ్లైఓవర్ కింద చెత్త డంపింగ్, జిచ్ఎంసి పార్క్, అసోసియేషన్‌లో నెలకొన్న పలు సమస్యల గురించి తెలుసుకున్నారు. ఫ్లైఓవర్ కింద పేరుకుపోయిన చెత్తను, ఇరిగేషన్ పైప్ లైన్ సమస్యల‌ గురించి వివరించారు. ఈ సందర్బంగా ఆదిత్య ఇంపీరియల్ హైట్స్ అసోసియేషన్ వాసులు పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని గౌతమ్ గౌడ్ కి అందజేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here