మాయ‌మాట‌లు చెబుతూ బీసీల‌ను మ‌భ్య పెడుతున్న కాంగ్రెస్ ప్ర‌భుత్వం: రవికుమార్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 2 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కామారెడ్డి డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ బీసీలపై కపట నాటక వైఖరిని ప్ర‌ద‌ర్శిస్తుంద‌ని నిర‌సిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన మహాధర్నా కార్యక్రమానికి శేరిలింగంప‌ల్లి నుంచి ఆ పార్టీ శ్రేణులు భారీగా త‌ర‌లివెళ్లాయి. ఈ సంద‌ర్బంగా కార్య‌క్ర‌మానికి త‌ర‌లి వెళ్లిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడె, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ అధికారం కోసం కామారెడ్డి డిక్లరేషన్ పేరుతో బీసీలకు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక బీసీ సంక్షేమానికి ఇస్తానన్న రూ.20000 కోట్ల నిధులు , బీసీ యువతకు ఇప్పిస్తామన్న రుణాలు మాట ఎత్తకుండా, 42 శాతం రిజర్వేషన్లు అని చెప్పి అందులో ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 32 శాతం మాత్రమే అని చెప్పకనే చెబుతూ కాల‌యాప‌న చేస్తున్నార‌ని అన్నారు. 42 శాతం రిజర్వేషన్లు ఇప్పించేవరకు వరకు పోరాడుతాం అని అన్నారు. మాయమాటలతో మభ్యపెడుతూ బీసీలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఇందిరాపార్క్ వ‌ద్ద ధ‌ర్నా చేప‌ట్ట‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ నాయకులు రాధాకృష్ణ యాదవ్, రమణయ్య, అశోక్ యాదవ్, సత్యనారాయణ రాజు, ఆంజనేయులు సాగర్, నరసింహ చారి, గణేష్, జితేందర్, లక్ష్మణ్, పద్మ ,వరలక్ష్మి, శివ సింగ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here