శేరిలింగంపల్లి, జూలై 15 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర సంస్కృతి , సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా బోనాల పండుగను అంగరంగ వైభవంగా జరుపుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ని 92 దేవాలయాలకు గాను మంజూరు చేసిన రూ.30,61,000 నిధులను చెక్కుల రూపేణ దేవాలయాల కమిటీ ప్రతినిధులకు EO సత్యనారాయణ, కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డితో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతి ,సంప్రదాయాలకు ప్రతీక అయిన బోనాల పర్వదినం సందర్భంగా కన్నుల పండుగ వాతావరణం లో అంగరంగ వైభవంగా బోనాలు జరుపుకోవాలని అన్నారు. అమ్మ వారి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని అమ్మవారిని వేడుకుంటున్నాను అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, దేవాలయాల కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






