ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ ఎన్టీఆర్ నగర్ కాలనీకి చెందిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ సమక్షంలో తెరాసలో చేరారు. ఈ సందర్భంగా వారికి గాంధీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం గాంధీ మాట్లాడుతూ తెరాస ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు, చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ప్రజలు స్వచ్ఛందంగా తెరాసలో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీసీ సంఘం అధ్యక్షుడు రాజేంద్ర చంద్ర, వార్డు సభ్యుడు కాశీనాథ్ యాదవ్ పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో యాస్మిన్, మహమూదా, పద్మ, తులసి, రుక్సానా, చాంద్ వి, సలీం, అఫ్సర్, అఫ్రోజ్, అబ్జల్ ఉన్నారు.