శేరిలింగంపల్లి, డిసెంబర్ 7 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ చైతన్యనగర్ లోని నాగదేవతా, సుబ్రమణ్య స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్య సష్టి సందర్బంగా ప్రత్యేక పూజలు నిర్వహించిన సందర్బంగా స్థానిక కాలనీ వాసి అనిల్ ఆహ్వానం మేరకు పూజ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు విద్యకల్పన ఏకాంత్ గౌడ్ పాల్గొని స్వామి వారి అశీసులు తీసుకున్నారు. ఈకార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ సంధ్య, షాలిని, నాగమణి, స్థానికులు పాల్గొన్నరు.