శేరిలింగంపల్లి, నవంబర్ 12 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కి చెందిన మోహన్ నాయక్ వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా CMRF ద్వారా మంజూరైన రూ.60,000 ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF చెక్కును బాధిత కుటుంబానికి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.