ఐలమ్మ పోరాటం నేటి తరానికి స్ఫూర్తి దాయకం : సామెల్ కార్తీక్

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబర్ 26 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో భూమి కోసం చేసిన పోరాట ఉద్యమకారిణి, నేటి తరం యువతకు పోరాట పటిమకు దిక్సూచి చూపించిన వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాలతో ఏర్పాటు చేసిన జయంతి కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి చాకలి ఐలమ్మ చిత్రపటానికి 106 డివిజన్ కంటెస్ట్ కార్పొరేటర్ సామెల్ కార్తీక్ ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో యువజన, విద్యార్థి, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు.

చాక‌లి ఐల‌మ్మ చిత్ర‌ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పిస్తున్న కార్తీక్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here