చందానగర్(నమస్తే శేరిలింగంపల్లి): ప్రతీ ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో తమ వంతు బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని చందానగర్ కార్పొరేటర్ నవత రెడ్డి అన్నారు. వరదల కారణంగా కాలనీలో పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించేందుకు జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వారం రోజుల శానిటేషన్ డ్రైవ్ ను చందానగర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీల్లో పారిశుధ్య పనులు పర్యవేక్షించిన నవతా రెడ్డి స్థానికులకు పలు సూచనలు చేశారు. వారం రోజుల పాటు నిర్వహించే స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ద్వారా ప్రతీ కాలనీ, ప్రతి గల్లీ శుభ్రం చేసి ఎంటమోలీజి సిబ్బంది చే స్ప్రే చేయటం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ తమతమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు నాగేశ్వర్ రావు,జీహెచ్ఎంసీ శానిటేషన్ సిబ్బంది శ్రీనివాస్ వర్మ, బాలాజీ, ఎంటమోలీజి సిబ్బంది శ్రీనివాస్ , గౌస్ తదితరులు పాల్గొన్నారు.