ఆల్విన్ కాలనీ (నమస్తే శేరిలింగంపల్లి): ఆల్విన్ కాలనీ డివిజన్ టీఆర్ఎస్ మహిళా నాయకురాలు శిరీష సత్తూర్ ఆదివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పట్టభద్రుల ఓటరు నమోదు గడువును నవంబర్ 30 వరకు పొడిగించడాన్ని శిరీష స్వాగతించారు. ఈ క్రమంలో డివిజన్‌లోని పట్టభద్రులచే నమోదు చేయించిన ఫామ్ 18 పత్రాలను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఆమె అందజేశారు. ఆల్విన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్‌గౌడ్ సహకారంతో ఇప్పటికే 250 మంది పట్టభద్రులను ఓటర్లుగా నమోదు చేసి పత్రాలను ప్రభుత్వ విప్ గాంధీకి అందజేశామని మంత్రికి ఆమె తెలిపారు. గడువు పెంపు నేపథ్యంలో డివిజన్‌లోని పట్టభద్రులందరిచే ఓటరు నమోదు చేయించేందుకు కృషిచేస్తానని అన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ శిరీష సత్తూర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళ నాయకులు పద్మ, ప్రసూన తదితరులు పాల్గొన్నారు.