- కార్పొరేటర్ హమీద్ పటేల్
కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు అకాల వర్షాలకు నష్టపోయిన బాధిత కుటుంబాలకు పదివేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించి ఆదుకోవటం జరుగుతున్నదని కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. శుక్రవారం డివిజన్ పరిధిలోని గోపాల్ రెడ్డి నగర్, హనీఫ్ కాలనీ, సిద్దిక్ నగర్ లలోని పలు బస్తీలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు ఆర్ధిక సహాయాన్ని ఆయన అందజేశారు.
కష్టకాలంలో ఆదుకున్న సీఎం కేసీఆర్ కి ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారని, ఎలాంటి విపత్కర పరిస్థితులలోనైనా తెరాస ప్రభుత్వం అండగా ఉంటుందనే ధైర్యం వారి కళ్ళలో కనబడిందని కార్పొరేటర్ హమీద్ పటేల్ అన్నారు. ఇలాంటి విపత్కర సమయంలో పేద ప్రజల కష్టాలు అర్ధం చేసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్ధిక సహాయం చేయటం ఎంతో సంతోషించాల్సిన విషయం అని కార్పొరేటర్ హమీద్ పటేల్ పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు డీఈ రమేష్, ఏఈ శ్రీనివాస్, వీఆర్ఏ శ్రీకాంత్, వార్డు మెంబర్స్ చాంద్ పాషా, గౌరీ, ఏరియా కమిటీ మెంబర్ తాడెం మహేందర్, తెరాస నాయకులు ఎర్రరాజు, నందు, మహ్మద్ అలీ, సర్తాజ్, తిరుపతి, బాలరాజు, గణపతి, యూత్ నాయకులు దీపక్, జుబేర్, స్థానికులు పాల్గొన్నారు.