వ‌ర‌ద స‌హాయంపై బాధితుల హ‌ర్షం

  • మిరియాల ప్రీతమ్

చందాన‌గ‌ర్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): టీఆర్ఎస్ ప్రభుత్వం అందజేస్తున్న తక్షణ ఆర్థిక సహాయంపై వరద బాధితుల కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయ‌ని టీఆర్ఎస్ యువజన నాయకుడు మిరియాల ప్రీతమ్ అన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని శివాజీనగర్ లో వ‌ర‌ద బాధితుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన రూ.10వేల ఆర్థిక స‌హాయాన్ని శుక్ర‌వారం అధికారులతో కలిసి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మిరియాల రాఘవరావు, యువజన నాయకుడు మిరియాల ప్రీతమ్ లు పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్, ప్ర‌భుత్వ విప్ ఆరెక‌పూడి గాంధీల‌ సహకారంతో ప్రతి వరద బాధిత కుటుంబానికి రూ.10 ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రెడ్డి రఘునాథ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉరిటి వెంకట్ రావు, దూబే, గోపి, రాజు, జనార్దన్ రెడ్డి, వెంకటేష్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

బాధితుల‌కు రూ.10వేల స‌హాయం అంద‌జేస్తున్న మిరియాల రాఘ‌వ‌రావు, మిరియాల ప్రీత‌మ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here