వాన దేవుడు ఇబ్బంది పెట్టాడు

  • తెలంగాణ దేవుడు అదుకుంటున్నాడు
  • కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

చందాన‌గ‌ర్‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): భారీ వ‌ర్షాల వ‌ల్ల వ‌చ్చిన వ‌ర‌ద‌ల‌కు న‌ష్ట‌పోయిన ప్ర‌తి కుటుంబాన్ని ప్ర‌భుత్వం ఆదుకుంటుంద‌ని చందాన‌గ‌ర్ డివిజ‌న్ కార్పొరేట‌ర్ బొబ్బ న‌వ‌త రెడ్డి అన్నారు. శుక్ర‌వారం ఆమె డివిజ‌న్ ప‌రిధిలోని తారాన‌గ‌ర్ బ‌స్తీ, వేముకుంట బ‌స్తీ, కైలాష్ న‌గ‌ర్ కాల‌నీ, జ‌వ‌హ‌ర్ కాల‌నీల్లో వ‌ర‌ద బాధితుల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం అంద‌జేసిన రూ.10వేల ఆర్థిక స‌హాయాన్ని పంపిణీ చేశారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ.. వాన దేవుడు ప్ర‌జ‌ల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తే తెలంగాణ దేవుడైన సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను ఆదుకుంటున్నార‌ని అన్నారు. వ‌ర‌ద బాధిత కుటుంబాలు ఒక్క‌రికి రూ.10వేలు ప్ర‌క‌టించినందుకు సీఎం కేసీఆర్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. చందాన‌గ‌ర్ డివిజన్ పరిధిలో వ‌ర‌ద బాధితులంద‌రికీ స‌హాయం పంపిణీ చేస్తామ‌ని తెలిపారు.

వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

ఈ కార్య‌క్ర‌మంలో డివిజ‌న్ తెరాస అధ్యక్షుడు రెడ్డి రఘునాథ్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ సునీత ప్రభాకర్ రెడ్డి, నాయకులు ఉరిటి వెంకట్రావు, జనార్దన్ రెడ్డి, మిరియాల ప్రీతం పాల్గొన్నారు.

వ‌ర‌ద బాధితుల‌కు రూ.10వేలు పంపిణీ చేస్తున్న కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here