శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తారానగర్ తుల్జాభవాని ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఏడవరోజు అమ్మవారు శాఖాంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించిన తీరు భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ పాలకమండలి చైర్మన్ మల్లికార్జున శర్మ, ఈఓ విజయభారతి, సభ్యులు సంజీవరెడ్డి, రేణుక శ్రీనివాస్ గౌడ్, గోవింద చారి, రాజు తీవారి, సంపత్, రవిందర్లతో పాటు పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శాంఖబరి దర్శనం చేసుకున్నారు.