బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్ ఏర్పాట్లకు సహకరించండి – జీహెచ్ఎంసీ ‌కమిషనర్ కు బిజెపి కార్పొరేటర్ల వినతి

నమస్తే శేరిలింగంపల్లి: బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశం ఏర్పాట్లకు జీహెచ్ఎంసీ తరపున సహకారం అందించాలని జీహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ కు బిజెపి కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, కరుణాకర్ కోరారు. ఈ మేరకు కమిషనర్ కు గచ్చిబౌలి, గుడిమల్కాపూర్ కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, కరుణాకర్ వినతి పత్రం అందజేశారు.
జూలై ఒకటో తేదీ నుంచి నాల్గో తేదీ వరకు మాదాపూర్ లోని నోవాటెల్ హోటల్ లో తలపెట్టిన బిజెపి నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశానికి అనుమతినివ్వాలని కోరారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బిజెపి పార్లమెంటు సభ్యులు, బిజెపి ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు.
హైదరాబాద్ ఖ్యాతిని పెంచేలా ఫుట్ పాత్ లను, రోడ్లను శుభ్రం చేసేలా, స్వచ్ఛ్ భారత్ కు సంబంధించిన అందమైన కళా కృతులను, పెయింటింగ్స్ ను ఏర్పాటు చేసి శోభాయమానంగా వీధి దీపాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ కు వినతి పత్రం ఇస్తున్న బిజెపి కార్పొరేటర్లు గంగాధర్ రెడ్డి, కరుణాకర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here