నమస్తే శేరిలింగంపల్లి: కరోనా నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించిన శ్రేయాస్ మీడియా, మైత్రి మూవీ మేకర్స్ ఈవెంట్ ఆర్గనైజర్లపై మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మాదాపూర్ లోని శిల్ప కళావేదికలో ఈ నెల 9 వ తేదీన శ్రేయాస్ మీడియా సంస్థ, మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించిన “అంటే సుందరానికి” సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించి కరోనా నియమాలు పాటించకుండా నిర్వహించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 51 (బి) ఐపీసీ 188 సెక్షన్ కింద ఈవెంట్ ఆర్గనైజర్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.