నమస్తే శేరిలింగంపల్లి: రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్పించేలా అనుచిత వాఖ్యలు చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని శేరిలింగంపల్లి కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బండి సంజయ్ పై చర్యలు తీసుకోవాలంటూ మైనారిటీ చైర్మన్ జహంగీర్ అద్వర్యంలో చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఎంపీ, ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుని హోదాలో ఉండి బండి సంజయ్ ఇష్టారీతిగా అనుచిత వాఖ్యలు చేయడాన్ని కాంగ్రెస్ శ్రేణులు చాలా తీవ్రంగా ఖండించాయి. 1991 చట్టాన్ని ఉల్లంఘిస్తూ మాట్లాడిన మాటలపై అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటివారైనా సరే చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీనియర్ కాంగ్రెస్ నాయకులు రఘునందన్ రెడ్డి, మహిపాల్ యాదవ్, ఇలియాస్ షరీఫ్, నాగేష్ నాయక్, సురేష్ నాయక్, ఆయాజ్ ఖాన్, అజీముద్దీన్, అల్లా ఉద్దీన్ పటేల్, షేక్ ఖాజా, అక్బర్, ఆజాం, లతీఫ్, సామి ఖురేషి, యువజన నాయకులు సౌందర్య రాజన్, కవిరాజ్, కార్తిక్ శామ్యూల్, దుర్గేష్, సాయి కిషోర్, ఫయాజ్, సలీం, తదితరులు పాల్గొన్నారు.