నమస్తే శేరిలింగంపల్లి: జనప్రియ అపార్ట్మెంట్ లోని సాయి బాబా మందిర ప్రాంగణంలో గల కమ్యూనిటీ హాల్ లో శ్రీ శబరి శాస్త్ర సేవ సమితి ఆధ్వర్యంలో ప్రతి రోజూ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే సోమవారం బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కలివేముల మనోహర్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు ప్రత్యేక పూజలు చేశారు. అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదని, ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయడం గొప్ప వరమని మనోహర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కె. యాదగిరి, మహాలక్ష్మి, జిల్లా గీత సెల్ కన్వీనర్ టి. రవిగౌడ్, శ్రీనివాసరావు, కె.విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.