సీసీ రోడ్టు పనులను పరిశీలించిన కార్పొరేటర్ మంజుల రెడ్డి

నమస్తే శేరిలింగంపల్లి: ప్రతి కాలనీలో మౌలిక వసతుల కల్పనకు తమ శాయశక్తులా కృషి చేస్తామని చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ లో రూ.20 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను బుధవారం స్థానిక కార్పోరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ కోట్ల రూపాయల వ్యయంతో చందానగర్ డివిజన్ లో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందని అన్నారు. ప్రతి కాలనీలో ప్రజలకు అవసరమయ్యే మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. దశల వారీగా అభివృద్ధి చేసి చందానగర్ డివిజన్ ను ఆదర్శ డివిజన్ గా తీర్చిదిద్దుతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు భాస్కర్ రావు, హనుమంతు రావు, బబ్లూ, రాజు, చంద్రమౌళి, మంగపాటి, విజయ్ కుమార్, సీతారత్నం, జీహెచ్ఎంసీ అధికారులు ఏఈ రమేష్, వర్క్ ఇన్‌స్పెక్టర్ హరీష్, జగన్ తదితరులు పాల్గొన్నారు.

సీసీ రోడ్డు పనులను పరిశీలిస్తున్న కార్పొరేటర్ మంజులరఘునాథ్ రెడ్డి
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here