సీఎంఆర్ఎఫ్ పేదకుటుంబాలకు ఆసరా: ప్రభుత్వ విప్ గాంధీ

నమస్తే శేరిలింగంపల్లి: టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికి ఎదో ఒక సంక్షేమ పథకాన్ని అందజేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. శేలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ డివిజన్ పరిధి అంజయ్య నగర్ కి చెందిన, సబియా బేగంకు అత్యవసర చికిత్స కోసం మంజూరైన సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సీ రూ. 2 లక్షల చెక్కును ప్రభుత్వ విప్ గాంధీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య చికిత్స పరంగా పేద కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు సీఎంఆర్ఎఫ్ పథకం ఆసరాగా‌ నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కిషోర్,‌ మధు, తదితరులు పాల్గొన్నారు.

సీఎంఆర్ఎఫ్ ఎల్ ఓ సీ అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here