నమస్తే శేరిలింగంపల్లి: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జన్మదిన ఉత్సవాలను పురస్కరించుకుని సేవా ఔర్ సమర్పన్ అభియాన్ లో భాగంగా ఆదివారం గోకుల్ ప్లాట్స్‌లో భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర నాయకులు రవి కుమార్ యాదవ్ పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. దేశంలో ప్రధాన మంత్రి మోడీ పాలనతో ప్రజలకు ఉపయోగపడేలా ఎన్నో నూతన చట్టాలను ప్రవేశపెట్టారని అన్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ప్రత్యక్ష ప్రసారం లో బీజేపీ పార్టీ సీనియర్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, గంగుల నరసింహ యాదవ్, రాధా కృష్ణ యాదవ్, వినయ్ బాబు, మదనాచారి, ప్రభాకర్ యాదవ్ హరిప్రియ, మధుయాదవ్, శ్రీశైలం యాదవ్ ,శిరీష, పద్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు.