ప్రతి కాలనీలో టీఆర్ఎస్ కమిటీలను వేస్తాం: కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్

నమస్తే‌ శేరిలింగంపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచన మేరకు, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్.జి రంజిత్ రెడ్డి,‌ శేరిలింగంపల్లి శాసనసభ్యులు ఆరెకపూడి గాంధీ ఆదేశాల మేరకు హఫీజ్ పేట్ డివిజన్ పరిధిలో ప్రతి కాలనీల్లో టీఆర్ఎస్ బస్తీ కమిటీలను వేయడం జరుగుతుందని స్థానిక కార్పొరేటర్ పూజిత జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్ తో కలిసి జనప్రియ నగర్ – 1 లో టీఆర్ఎస్ బస్తీ, మహిళ కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ అవకాశం‌ లభిస్తుందన్నారు. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య వారధిగా టీఆర్ఎస్ పార్టీ ‌కార్యకర్తలు పనిచేస్తారని అన్నారు. జనప్రియ నగర్ 1 బస్తి కమిటీ అధ్యక్షునిగా బి. శాంతయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎం.రవి, కన్వీనర్ ఈ.వి. మూర్తి, జనప్రియ నగర్ 1 మహిళ కమిటీ అధ్యక్షునిగా ఏ. శ్రీలత, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బి.పద్మ, కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

జనప్రియ‌ నగర్ బస్తీ కమిటీలను నియమిస్తున్న కార్పొరేటర్ పూజితజగదీశ్వర్ గౌడ్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here