నమస్తే శేరిలింగంపల్లి: హఫీజ్ పెట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో బుధవారం టీఆర్ఎస్ పార్టీ హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షుడు బాలింగ్ గౌతమ్ గౌడ్ వాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవాలని అన్నారు. సామాజిక దూరం పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన వెంట డా.కార్తిక్, వినయ్ , రమేష్, స్థానిక నాయకులు సంజు, ముజీబ్, కామాజి, ఆస్పత్రి సిబ్బంది, కాలనీ వాసులు తదితరులు ఉన్నారు.