శేరిలింగంపల్లి (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగుల సంఘం (టీపీయూఎస్) నూతన సంవత్సరం డైరీని హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు, మియాపూర్ డివిజన్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ లతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంధం రాములు, సెక్రటరీ జనరల్ ఉప్పల రావు, విద్యా వెంకట్, కార్మిక విభాగం అధ్యక్షుడు గంగాధర్ రావు, విద్యాశాఖ అధ్యక్షుడు పీవై రమేష్, రవీందర్, శ్రీధర్ రెడ్డి, భాస్కర్, మోహన్, యాకయ్య, మహిళా నాయకురాలు శ్రావణి రెడ్డి, పుష్ప, పద్మావతి, విజయ లక్ష్మీ, తెరాస నాయకులు పురుషోత్తం యాదవ్, సురేష్ గౌడ్, వినయ్ చారి, రామకృష్ణ పాల్గొన్నారు.