హఫీజ్‌పేట్‌లో SIR-2పై బీజేపీ నాయకుల పర్యటన.. BLOలతో కీలక అంశాలపై చర్చ

శేరిలింగంప‌ల్లి, సెప్టెంబ‌ర్ 30 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): SIR-2 ప్రక్రియలో భాగంగా హఫీజ్‌పేట్ డివిజన్‌లో బీజేపీ నాయకులు పర్యటించారు. బీజేపీ రాష్ట్ర, జిల్లా పార్టీ సూచనల మేరకు డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ ఆధ్వర్యంలో నాయకులు పోలింగ్ బూత్‌ల పరిధిలోని BLO అధికారులను కలిశారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్లకు అందజేసిన నోటీసులు, వాటిపై ఓటర్ల స్పందన, ఇంకా సేకరించాల్సిన వివరాలపై BLOలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఫారం-6, ఫారం-8కు సంబంధించిన అభ్యర్థనలను వెంటనే పూర్తి చేయాలని కోరారు.

కొన్ని పోలింగ్ బూత్‌ల పరిధిలో మరణించిన ఓటర్ల వివరాలను సేకరించి, నిబంధనల ప్రకారం వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు వివరాలను పరిశీలించుకుని, SIR ప్రక్రియలో BLOలకు సహకరించాలని నాయకులు కోరారు. అనర్హులకు ఓటరు జాబితాలో చోటు కల్పించేందుకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వకూడదని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ BLA-1, జిల్లా బీజేపీ కార్యదర్శి మాణిక్ రావు, బీజేపీ ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యుడు బోయిని మహేష్ యాదవ్, జిల్లా ఎస్టీ మోర్చా అధ్యక్షుడు విజేందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీధర్ రావు, రవి గౌడ్, బీజేపీ నాయకుడు మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here