బీసీ మహిళా రిజర్వేషన్ లో బీసీ మహిళా సబ్ కోటా ఇవ్వాలి: డాక్టర్ ఉప్పరి శేఖర్ సగర

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 13 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): పార్లమెంట్ లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ మహిళా సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ బిసి మహిళా సంఘం నిర్వహించిన ధర్నాలో తెలంగాణ బీసీ జేఏసీ కో చైర్మన్, తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఉప్పరి శేఖర్ సగర, బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు బార్ల మణిమంజరి సగర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, మాజీ పార్లమెంట్ సభ్యుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోడల ఆంజనేయులు సగర, గ్రేటర్ హైదరాబాద్ సగర సంఘం అధ్యక్షుడు మోడల రవి సగర, గ్రేటర్ యువజన సంఘం అధ్యక్షుడు ఎర్రంశెట్టి సీతారాం సగర పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here