కొండాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): కొండాపూర్ డివిజన్ పరిధిలోని హనీఫ్ కాలనీలో వరద బాధితులకు ప్రభుత్వం అందజేసిన రూ.10వేల సహాయాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ శుక్రవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శేరిలింగంపల్లిలో వరద ముంపుకు గురైన అందరికీ సహాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈ రమేష్, తెరాస నాయకులు శ్రీనివాస్ చౌదరి, తిరుపతి, రజినీకాంత్, మహేందర్ పాల్గొన్నారు.