నమస్తే శేరిలింగంపల్లి: నడిగడ్డ తండాలో ప్రజల సౌకర్యార్థం శనివారం ఏర్పాటు చేసిన కరోనా మొబైల్ వ్యాక్సినేషన్ ప్రక్రియను గిరిజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు తిరుపతి నాయక్ పరిశీలించారు. కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ వేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ అధ్యక్షుడు స్వామి నాయక్, క్రిష్ణ నాయక్, రెడ్యానాయక్ శంకర్ నాయక్, ఎస్ ఆర్ పీ కనక రాజు, రవి, దేవా నాయక్, రమేష్, సంతోష్, లక్ పతి తదితరులు పాల్గొన్నారు.