నమస్తే శేరిలింగంపల్లి: చందానగర్ ప్రాంతానికి చెందిన కౌశిక్ అనే విద్యార్థి చదువులో రాణిస్తున్నాడు. కళాశాల ఫీజు చెల్లింపుల కోసం అవస్థలు పడుతున్న కౌశిక్ కు లయన్స్ క్లబ్ హైదరాబాద్ హోప్ అధ్యక్షుడు కొండ విజయ్ రూ.10 వేలు ఆర్థిక సహాయం అందచేశారు. విద్యలో రాణిస్తున్న కౌశిక్ ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కొండ విజయ్ కోరారు. ఉత్తమ విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ హోప్ చేయూత ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ మేరకు కౌశిక్ తల్లికి రూ.10 వేల చెక్కును అందచేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ పుట్ట వినయ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.






