శేరిలింగంపల్లి, ఫిబ్రవరి 1 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్ర బీసీ కులాల బీసీ సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ ఐక్యవేదిక కేంద్రీయ కార్యాలయంలో అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఆర్కే సాయన్న ముదిరాజ్, తీన్మార్ మల్లన్న ఆర్గనైజర్ సెక్రెటరీ విజయ్ యాదవ్ చరణ్ , కృష్ణ ముదిరాజ్, కమలాకర్, శివరాజ్ ముదిరాజ్, ఎండి కమల్ పాషా, శేరిలింగంపల్లి మైనార్టీ కన్వీనర్ నరసింహ యాదవ్, శేరిలింగంపల్లి నేతాజీ నగర్ మహిళా అధ్యక్షురాలు సత్తమ్మ, నేతాజీ నగర్ చారి, రంగారెడ్డి జిల్లా మహిళా కన్వీనర్ పాల్గొని నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జేఏసీ చైర్మన్, బీసీల ఐక్యవేదిక అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్ తోపాటు ఆర్కే సాయన్న , రంగారెడ్డి జిల్లా మహిళా కన్వీనర్ హిందూ మతి, నరసింహ యాదవ్, విజయ్ కుమార్, కృష్ణ, నేతాజీ నగర్ వాసులు సత్యమ్మ పాల్గొన్నారు.